బాకారం మహాత్మానగర్ శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం
హైదరాబాద్, మార్చి 27, అద్దం న్యూస్ : శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాకారం డివిజన్ మహాత్మానగర్‌లో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ సీతారాంలం కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడు, క్రిస్టియన్ మైనార్టీ కమిషన్ చైర్మన్ దీపక్ జాన్, టీపీసీసీ కార్యదర్శి నాగభూషణం, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి దేవాలయం బోర్డు సభ్యుడు, ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవి వరప్రసాద్.. దీపక్ జాన్ కు శాలువాలు కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గుండెలు సాయికుమార్, వంశీ, మహాత్మా నగర్ నాయకుడు, బిజెపి నాయకుడు బిజ్జి కనకేష్, విజయ్, శివ, శ్వేత తదితరు పాల్గొన్నారు.














Leave a Reply