Wednesday, October 28, 2026
No menu items!
Homeculturalsనవంబర్ 4 న ఎన్‌టిఆర్‌ స్టేడియంలో శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం – మాజీ ఎంపీ అంజన్‌కుమార్...

నవంబర్ 4 న ఎన్‌టిఆర్‌ స్టేడియంలో శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం – మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్

📰 Generate e-Paper Clip

బ‌షీర్‌బాగ్‌, అక్టోబర్ 25, ( అద్దం న్యూస్ ) :     నగరంలోని ఎన్‌టిఆర్‌ స్టేడియంలో నవంబర్ 4 వ తేదీన‌ శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం, గోమాత పూజ, శ్రీకృష్ణ పూజలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తెలిపారు. హైద‌రాబాద్ ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ లతో కలిసి కార్యక్రమ వివరాలను ఆయన వెల్లడించారు. నవంబర్ 4న బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, వివిధ రాష్ట్రాల మంత్రులు ఎంపీలు హాజరవుతారని తెలిపారు. రాష్ట్రం నుంచి వేలాది మంది భక్తులు, యాదవ సంఘాల ప్రతినిధులు, రైతులు, యువత హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించడం యాదవ సమాజానికి గర్వకారణమని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడుతుందని అన్నారు. సదర్ సమ్మేళనం ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదని, సామాజిక ఐక్యత, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈసారి ప్రత్యేక జాతుల దున్నారాజుల ప్రదర్శనతో పాటు దప్పు, డోలు, సంప్రదాయ వాద్యబృందాల ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖ నాయకులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. అన్ని కులాలు, మతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని అంజన్‌కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిసిసి అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, యాదగిరిగుట్ట ఆలయ పాలకమండలి సభ్యురాలు ఈశ్వరమ్మ, లడ్డు యాదవ్ తదితర నేతలు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page