హైదరాబాద్, నవంబర్ 18, అద్దం న్యూస్ : విద్యార్థినీ, విద్యార్థులు సైబర్ నేరాలను నివారించాలంటే వాటిపై అవగాహన ఉండాల్సిన అవసరముందని చిక్కడపల్లి ఏఎస్ఐ వేణుగోపాల్ అన్నారు. అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్, చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ సహకారంతో సైబర్ నేరాలు, వాటి నిర్మూలన అంశం పై మంగళవారం ఆర్టీసి క్రాస్‌రోడ్‌లోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిక్కడపల్లి ఏఎస్ఐ వేణుగోపాల్, శ్రీనివాస్ లు హాజరై మాట్లాడుతూ…సైబర్ క్రైమ్ అంటే కంప్యూటర్, మొబైల్, ఇంటర్నెట్, డిజిటలైజేషన్ ద్వారా చట్ట విరుద్ధంగా జరిగేదే సైబర్ క్రైమ్ అంటారన్నారు. సైబర్ నేరాలు రకాలు అకౌంట్ హాకింగ్ చేయడం, చట్ట విరుద్ధం నకిలీ మెయిల్స్ పంపడం ఆన్లైన్ ద్వారా హింసించడం, ఓటీపీ ద్వారా డబ్బులు దోచుకోవడం,ఫేక్ ఐడీలు ద్వారా మోసం చేయడం, ఫోటో మార్పిడి కింగ్ ద్వారా బ్లాక్ మెయిల్ చేయడం అని అన్నారు. కళాశాల అధ్యాపకులు ఆరిఫ్ మాట్లాడుతూ…సైబర్ నేరాలతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అప్స స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అప్స సీనియర్ కో–ఆర్డినేటర్ రమేష్ మాట్లాడుతూ… విద్యార్థులు మొబైల్స్ ఫోన్ కూడా దూరంగా ఉండాలన్నారు. దాని వలన మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుందని, సైబర్ నేరాలకు గురైతే వెంటనే డయల్ 100 కు గానీ, డయల్ 112 కు గానీ ఉచిత ఫోన్ కాల్ చేసి సహాయాన్ని పొందాలన్నారు.
Leave a Reply