పద్యనాటకాలను ఆదరించాలి – దక్షిణ మధ్య రైల్వే పూర్వ జనరల్ మేనేజర్ సి.రామకృష్ణ

సిటి కల్చరల్, అద్దం న్యూస్ : తెలుగునాట అనాదిగా ప్రదర్శిస్తున్న పద్యనాటకాలను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దక్షిణమధ్య రైల్వే పూర్వ జనరల్ మేనేజర్ సి.రామకృష్ణ అన్నారు. ప్రపంచ రంగస్థ దినోత్సవం సందర్భంగా అలకాపురి శృంగేరి శంకరమఠంలో భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయి బాబావారి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషాసాంస్కృతిక శాఖ, అలకాపురి శృంగేరి శంకరమఠం సహకారంతో చోడేశ్వర నాట్యమండలి ఆధ్వర్యంలో ప్రదర్శించిన తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగంలోని ‘పాండవుల ఉపప్లావ్య ఘట్టం’ ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామకృష్ణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చోడేశ్వర నాట్యమండలి ఆధ్వర్యంలో నాటక ప్రదర్శనలు ప్రదర్శిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి సుబ్బారావు మాట్లాడుతూ.. అనాదిగా పద్యనాటకాలను దేవాలయాలే ఆదరిస్తున్నాయని, తిరునాళ్ళుతో పాటు వివిధ ఉత్సవాల సమయంలో వాటకాలను ప్రదర్శించడం వల్ల అవి బహుళ ప్రచారం పొంది ప్రపంచ రంగస్థలం పై తెలుగు పద్యనాటకం అత్యున్నత స్థానాన్ని అందుకోగలిగిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవాసమితి ప్రతినిధి కూచిమంచి సూర్యనారాయణ మూర్తి, శృంగేరి శంకరమఠం ధర్మకర్త శ్రీనివాస్ పాల్గొన్నారు. సభకు ముందు ప్రదర్శించిన నాటకంలో శ్రీకృష్ణుడుగా మన్నె సర్వేశ్వరరావు, ధర్మరాజుగా బి. నారాయణస్వామి, భీముడుగా మంతోజు తాలాచారి, అర్జునుడుగా పులిగడ్డ మంగపతిరావు. నకులుడుగా మల్లాది వెంకటరమణ, సహదేవుడుగా మరడాపు రామమోహనరావు, ద్రౌపదిగా పి.సావిత్రి నటించారు. మల్లాది వెంకటరమణ నాటకాన్ని సమర్ధవంతంగా నిర్వహించగా మల్లాది సాయిహరీష్ సహకారాన్ని అందించారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page