విద్యార్థి సంఘాల నాయకుల పై 7 సెక్షన్స్ కింద మోపిన అక్రమ కేసులను ఎత్తివేయాలి
– పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేష్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు
హైదరాబాద్, ఆగస్టు 19, ( అద్దం న్యూస్ ) : నిజామాబాద్‌లో పిడిఎస్‌యు సహా లెఫ్ట్ విద్యార్థి సంఘాల నాయకుల పై 7 సెక్షన్స్ కింద మోపిన అక్రమ కేసులను ఎత్తివేయాలని పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేష్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు లు డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( పిడిఎస్‌యు ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ను ఆయన నివాసంలో కలిసి వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుల పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని తెలంగాణ డిజిపి సీవీ ఆనంద్ తో వి.హనుమంతరావు ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేష్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు లు మాట్లాడుతూ… నిజామాబాద్ జిల్లాలో విద్యార్థి ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. విద్యార్థి సంఘాల నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు బణాయించారని తెలిపారు. విద్యార్థి సంఘాల నాయకులపై మోపిన అక్రమ కేసులను పిడిఎస్‌యు రాష్ట్ర కార్యవర్గం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ జిల్లాలో విద్యార్థి ఉద్యమంపై ఉన్న నిర్బంధంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా గత నెల జూలై 24 వ తేదీన జరిగిన రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్‌కు పిడిఎస్‌యు, ఎన్ఎస్‌యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పిడిఎస్‌యు, ఏఐఎఫ్‌డిఎస్‌యు, ఏఐఎస్‌బి, ఏఐపిఎస్‌యు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయని తెలిపారు. బంద్ చేయమని అంటే డబ్బులు అడిగామని ఆరోపణ చేస్తూ కేసులు పెడతామని, చేతులు విరిగాయని, కాళ్ళు విరిగాయని పాత ఎక్స్ రే లు తీసుకువచ్చి కేసులు పెడతామని యాజమాన్యం బెదిరించిందన్నారు. యాజమాన్యంపై పోలీస్‌స్టేషన్‌లో విద్యార్థి సంఘాలు కేసు పెడితే దాని మీద కేసు బుక్ చేయలేదు కానీ, విద్యార్థి సంఘ నాయకులపై 329 ( 4 ),292, 351 ( 2 ), 324 ( 4 ), 308 ( 2 ), 126, r/w 3 ( 5 ) BNS తప్పుడు కేసులు బనాయించారన్నారు. తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షులు బోనగిరి మధు, జన్నారపు రాజేశ్వర్, డి.శ్రీకాంత్, కె.శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు తీగల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply