హైదరాబాద్, అక్టోబర్ 16, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లో ప్రభుత్వ కార్మిక శాఖ స్థలాన్ని కబ్జా చేయాలని కొంత మంది నాయకులు ప్రయత్నిస్తున్నారని, వారి నుంచి స్థలాన్ని కాపాడి, వారి పై తగిన చర్యలు తీసుకోవాలని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం గాంధీనగర్ కార్పొరేటర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినయ్ కుమార్ మాట్లాడుతూ… 1966లో అనసూయ అనే మహిళకు కార్మిక శాఖకు సంబంధించిన దాదాపు 350 గజాల ఏడు కోట్ల విలువ చేసే స్థలాన్ని జవహర్ స్కూల్ నడుపుకోవడానికి లీజుకు ఇచ్చారన్నారు. లీజు స్థలంలో గత పది సంవత్సరాలుగా పాఠశాలను నడపకుండా మూసివేసి అనసూయ అనే మహిళ ఆ స్థలాన్ని తమ కుటుంబీకుల పేరు పై పవర్ ఆఫ్ అటార్నీ చేయించిందని ఆరోపించారు. ఇదంతా స్థానిక నాయకుని కనుసన్నలో జరగడంతో మహిళ కుటుంబ సభ్యులు వద్ద నుంచి గాంధీనగర్‌లోని ప్రముఖ నాయకుడు స్థలాన్ని తీసుకొని దానిని వ్యాపార సముదాయాలకు వాడుకుంటున్నాడని ఆరోపించారు. కార్మిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేయడమే కాకుండా తప్పుడు పత్రాలు సృష్టించి దానిలో వ్యాపార సముదాయాలు నిర్వహించడం పై కార్మిక శాఖ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రభుత్వ కార్మిక స్థలంలో కార్మిక శాఖకు సంబంధించిన బోర్డును ఏర్పాటు చేశారన్నారు. దీని పై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
కార్మిక శాఖకు చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం :
– కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునిత గోపాల్ దాస్

గాంధీనగర్‌లోని జవహర్ హై స్కూల్ ఉండే స్థలం కార్మిక శాఖదే అని ఆ శాఖ జాయింట్ కమిషనర్ సునిత గోపాల్ దాస్ అద్దం న్యూస్ ప్రతినిధితో తెలిపారు. గాంధీనగర్‌లోని జవహర్ హై స్కూల్ ఉండే స్థలంలో కొంత మంది నాయకులు షెడ్డు వేసి వ్యాపారాలకు అద్దెకు ఇవ్వడంతో అద్దం న్యూస్ ప్రతినిధి కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునీత గోపాల్ దాస్ కు ఫోన్ చేసి అసలు ఆ స్థలం ఎవరిది తదితర అంశాలపై వివరణ కోరగా ఆమె స్పందించారు. ఆ స్థలం గతంలో జవహర్ స్కూల్ కోసం అనసూయ అనే మహిళకు లీజుకు ఇచ్చామని, ఆ లీజు గడువు ముగియడంతో ఆ స్థలాన్ని కార్మిక శాఖ స్వాధీనంలోకి తీసుకున్నామన్నారు. ఆ స్థలంలో ఎవరైనా వ్యాపారాలను నెలకొల్పినా.. క్రయ విక్రయాలు చేసినా నేరమవుతుందన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply