Wednesday, October 28, 2026
No menu items!
HomeGREATER HYDERABADఘనంగా టివైజెఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్ట‌ర్‌.తనుగుల జితేందర్ రావు జన్మదిన వేడుక

ఘనంగా టివైజెఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్ట‌ర్‌.తనుగుల జితేందర్ రావు జన్మదిన వేడుక

📰 Generate e-Paper Clip

కాప్రా, సెప్టెంబర్ 29, ( అద్దం న్యూస్ ) :    తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టివైజెఎఫ్ ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్ట‌ర్‌.తనుగుల జితేందర్ రావు జన్మదిన వేడుకలు సోమవారం హైదరాబాద్ కాప్రాలోని టివైజెఎఫ్ రాష్ట్ర యూనియన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టివైజెఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు, యూనియన్ ప్రతినిధులు, సభ్యులు, మిత్రబృందం ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఆత్మీయ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్ట‌ర్‌.జితేందర్ రావును గజమాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి, ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఆయురారోగ్యాలు, మరెన్నో విజయాలు కలగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పివి.నరసింహారావు కుమారుడు, టివైజెఎఫ్ ఛాంబర్స్ కమిటీ చైర్మన్ పివి.ప్రభాకర్ రావు తనకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నందుకు డాక్ట‌ర్‌.తనుగుల జితేందర్ రావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, సంస్థాగత కార్యక్రమాలు, వృత్తిపరమైన అంశాల్లో పివి.ప్రభాకర్ రావు సహకారం, ప్రోత్సాహం తనకు ఎప్పటికీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. టివైజెఎఫ్ అభివృద్ధి కోసం పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని డా.జితేందర్ రావు తెలిపారు. టివైజెఎఫ్‌ను రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలోపేతం చేస్తూ జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం కోసం మరింతగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టివైజెఎఫ్ రాష్ట్ర ప్రతినిధులు, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన జర్నలిస్టులు, యూనియన్ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని డా.జితేందర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page