జర్నలిస్టుల ఐక్యతే టివైజెఎఫ్ లక్ష్యం
– టివైజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.జితేందర్ రావు తనుగుల
హైదరాబాద్, మే 8, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల ఐక్యతే తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టివైజెఎఫ్ ) లక్ష్యమని టివైజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.జితేందర్ రావు తనుగుల అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో టివైజెఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా షేక్ మహబూబ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తాటికొండ వెంకటేశం, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా జగత్ కృష్ణ లడ్డు, రాష్ట్ర ట్రెజరర్‌గా ఎల్.మమత, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మేడ మల్లేశం లకు బాధ్యతలను జితేందర్ రావు అప్పటించారు. అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉమ, ఎండి.నయమత్ ఉల్లా, పీవీ శర్మలను నియమించారు. ఈ సందర్భంగా టివైజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.జితేందర్ రావు తనుగుల మాట్లాడుతూ… రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అక్రిడిటేషన్ సమస్యలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాలు, ఆరోగ్య భద్రత, మీడియా స్వేచ్ఛ వంటి అంశాలపై TYJF నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. అలాగే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది జర్నలిస్టులు TYJFలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని, త్వరలో మరిన్ని జిల్లాల్లో భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. జర్నలిస్టుల ఐక్యతతోనే మీడియా రంగానికి గౌరవం, భద్రత సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
పలు జిల్లాల కమిటీల ఏర్పాటు :
తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఆకాష్, ఉపాధ్యక్షుడిగా బోయిని శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం.రాజశేఖర్, జిల్లా ట్రెజరర్‌గా టి.సంగమేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాగరాజు ఎన్నికయ్యారు. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ ముక్తార్ బాధ్యతలు స్వీకరించారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఎం. మల్లేశం బాధ్యతలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా సంధ్య ఎన్నికయ్యారు. మెదక్ జిల్లా అధ్యక్షుడిగా మధుసూదనాచారి, ఉపాధ్యక్షుడిగా అంకం సురేష్ ఎన్నిక కాగా, పటాన్చెరు నియోజకవర్గ అధ్యక్షుడిగా హరీష్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.













Leave a Reply