వివేక్‌నగర్
శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం
హుండీ లెక్కింపు
ముషీరాబాద్, మే 6, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్ ఆంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం జరిగింది. ఆలయ ఈఓ మాచర్ల దేవనాధం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సురేఖ ల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 2 లక్షల 5 వేల 395 రూపాయల ఆదాయం రాగా, ఈ హుండీ లెక్కించగా 44 వేల 963 ల రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో మాచర్ల దేవనాథం, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సురేఖ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బుగ్గన లక్ష్మీపతి శర్మ, ఆలయ రెనోవేషన్ కమిటీ సభ్యులు శ్యామ్ ముదిరాజ్, భక్తులు పాల్గొన్నారు.













Leave a Reply