జుట్టుకి ఏ నూనె వాడితే మంచిది..?
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: జుట్టు సమస్యలు ఈ మధ్యకాలంలో చాలా మందిని వేధిస్తున్నాయి. అయితే సరైన హెయిర్ ఆయిల్‌ను ఎంచుకోవడం ద్వారా వీటిని సులభంగా పరిష్కరించవచ్చని ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక రెడ్డి తెలిపారు. కొబ్బరి నూనె నుండి రోజ్ మేరీ వరకూ ఏ నూనెను ఎలా వాడాలి? చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలకు ఏది ఉత్తమ పరిష్కారం? వంటి కీలక అంశాలను తెలుసుకుందాం.. కాలుష్యం, ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి. మార్కెట్లో దొరికే రకరకాల నూనెల్లో ఏది వాడాలో తెలియక చాలామంది తికమకపడుతుంటారు.
పిల్లల జుట్టు విషయంలో ఎక్కువ కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడటం మంచిది కాదు. అటువంటి సమయంలో కొబ్బరి నూనె ఉత్తమమైనది. ఇది మంచి హెయిర్ కండీషనర్‌గా పనిచేస్తుంది. తలస్నానానికి ఒక గంట లేదా 30 నిమిషాల ముందు జుట్టంతా దీనిని పట్టించాలి. అయితే జిడ్డు చర్మం ఉన్నవారు, చుండ్రు సమస్య ఉన్నవారు రాత్రంతా తలకు నూనె ఉంచుకోవద్దని నిపుణులు సూచించారు.
జుట్టు మృదువుగా, మెరుస్తూ కనిపించాలంటే బాదం నూనెను వాడాలి. తలస్నానానికి రెండు గంటల ముందు దీనిని అప్లై చేసుకోవాలి. కేవలం జుట్టుకే కాకుండా, పొడి చర్మం ఉన్నవారు దీనిని ఫేషియల్ ఆయిల్‌గా కూడా ఉపయోగించవచ్చు. జుట్టు చిక్కుబడకుండా, సూర్యరశ్మి నుండి జుట్టును రక్షించుకోవడానికి ఆర్గాన్ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. తలస్నానం చేసిన తర్వాత తడి జుట్టుపై రెండు మూడు చుక్కలు అప్లై చేస్తే సరిపోతుంది. ఫేస్ మసాజ్ కోసం కూడా దీనిని వాడుకోవచ్చు.
మన చర్మం సహజంగా ఉత్పత్తి చేసే సెబమ్ లాంటి గుణాలనే ఈ జోజోబా ఆయిల్ కలిగి ఉంటుంది. తల భాగం విపరీతంగా పొడిబారిపోయేవారు తలస్నానానికి ముందు దీనిని వాడటం వల్ల చర్మంలోని నూనెలు సమతుల్యంగా ఉంటాయి. జుట్టు రాలడం తగ్గి రక్త ప్రసరణ పెరగడానికి ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది. వారానికి రెండు మూడు సార్లు ఇతర ఆయిల్‌తో కలిపి నేరుగా స్కాల్ప్‌పై రాసుకోవాలి. క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఒత్తిడి తగ్గించుకోవడానికి భృంగరాజ్ ఆయిల్‌తో మసాజ్ చేయడం మంచిది. అయితే మసాజ్ చేసేటప్పుడు ఒత్తిడి తక్కువగా ఉండేలా చూసుకోవాలి. బలంగా రుద్దినా, ఒత్తిడితో మసాజ్ చేసినా జుట్టు తెగిపోయే ప్రమాదం ఉందని డాక్టర్ హెచ్చరించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply