నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యంగా పని చేయండి – సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఐఏఎస్

హైద‌రాబాద్‌ బ్యూరో, అద్దం న్యూస్‌ : నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యంగా పని చేయాల‌ని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ ఐఏఎస్ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ (సైఫాబాద్, మెహదీపట్నం, అజామాబాద్ డివిజన్ల) పరిధిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సర్కిల్ పరిధిలోని అధికారులను ఆయ‌న ఆదేశించారు. వేసవి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సెంట్రల్ సర్కిల్ పరిధిలో చేపట్టిన పనులను సంస్థ సీఎండీ ముషార‌ఫ్ ఫ‌రూఖీ మంగ‌ళ‌వారం సమీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గతంలో హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ పరిధిలో పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టు చర్యలు చేపట్టకపోడం వలన గతేడాది వేసవి కాలంలో కొన్ని ప్రాంతాల్లో ఓవర్ లోడింగ్ సమస్యలు ఏర్పడ్డాయన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ సర్కిల్ పరిధిలో వేసవి కార్యాచరణలో భాగంగా 35, 11 కేవీ ఫీడర్లను, 33 /11 కేవీ సబ్ స్టేషనల్లో 7 పిటిఆర్ఎస్‌, 149 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయడమైనదన్నారు. ఈ సమీక్షా సమావేశమనంతరం, గోల్కొండ 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన రెండు 12.5 ఎంబిఎ పవర్ ట్రాన్స్ ఫార్మర్లను, డైమండ్ హిల్స్ 11 కేవీ ఫీడర్, సయ్యద్ అక్తర్ ఫీడర్ లను ప్రారంభించారు. ఈ అదనపు ఏర్పాట్ల వలన సూర్య నగర్, డైమండ్ హిల్స్, ఉస్మానియా యూనివర్సిటీ కాలనీ, ఎండి లైన్స్, 7 టొంబ్స్, ఎఎ కాలనీ, గుల్షన్ కాలనీ, అక్బర్ పుర, ప్రైడ్ ఇండియా, ఆదిత్య కాలనీ, కొహె – సర్ కాలనీల పరిధిలోని 35 వేల సర్వీస్ కనెక్షన్ల సరఫరా మెరుగవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ డాక్టర్ యెన్ నర్సింహులు, మెట్రో జోన్ చీఫ్ ఇంజినీర్ చక్రపాణి, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు వెంకన్న, కరుణాకర్ బాబు, డివిజనల్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page