Friday, September 18, 2026
Homedevotionalచిలకలగూడలో ఘనంగా ఆలయ 72వ వార్షిక జయంతి ఉత్సవాలు

చిలకలగూడలో ఘనంగా ఆలయ 72వ వార్షిక జయంతి ఉత్సవాలు

చిలకలగూడలో ఘనంగా ఆలయ 72వ వార్షిక జయంతి ఉత్సవాలు
ఈనెల 16వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు
సాయిబాబా సమేత బాలాంజనేయ స్వామి ఆలయంలో ప్రారంభమైన వేడుకలు

 

సికింద్రాబాద్, ఏప్రిల్ 12, అద్దం న్యూస్ :   చిలకలగూడ సాయిబాబా సమేత బాలాంజనేయస్వామి ఆలయ 72 వ వార్షిక జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా శనివారం ప్రారంభం అయ్యాయి. మేళతాళాలు, బాజభజంత్రీలు, వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ఆలయ ఫౌండర్ ట్రస్టీ నాగులూరి సాయిబాబా ఆంజనేయస్వామి పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. సుప్రభాతం, గణపతిపూజ, సింధూర అలంకరణ, ధ్వజారోహణం, సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణం తదితర ఆథ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ నెల 16 వ తేది వరకు ఐదు రోజుల పాటు ఆలయ వార్షిక వేడుకలను కనుల పండువగా నిర్వహించనున్నట్లు సాయిబాబా తెలిపారు. బాలాంజనేయుని విగ్రహానికి పుష్పాలు, పండ్లు, వడలు, తమలపాకులతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారు ఆదివారం చందన అలంకరణలో దర్శనమిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో హజరై పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page