Thursday, November 5, 2026
No menu items!
HomeEducationస్కూల్ యూనిఫాంల పై పిల్ల‌ల నుంచి అభిప్రాయాల‌ను సేక‌రించండి – అధికారుల‌ను ఆదేశించిన‌ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

స్కూల్ యూనిఫాంల పై పిల్ల‌ల నుంచి అభిప్రాయాల‌ను సేక‌రించండి – అధికారుల‌ను ఆదేశించిన‌ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్ బ్యూరో, న‌వంబ‌ర్ 4, ( అద్దం న్యూస్ ) :     విద్యార్థుల‌కు అందించిన స్కూల్ యూనిఫాంలపై పిల్లల నుంచి అభిప్రాయాలు ( ఫీడ్‌బ్యాక్ ) సేక‌రించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. విద్యార్థుల నుంచి అభిప్రాయాలు ( Feedback ) సేక‌రించడం వల్ల భవిష్యత్తులో ఎక్కువ మంది విద్యార్థులు కోరుకునే రంగులు, డిజైన్ల‌కు ప్రాధాన్య‌మివ్వ‌చ్చ‌ని చెప్పారు. బుధ‌వారం ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో వివిధ శాఖ‌ల ప‌రిధిలోని ప్ర‌భుత్వ వ‌స‌తిగృహాలు, రెసిడెన్షియ‌ల్ స్కూళ్లు, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు యూనిఫాంలు, కిట్ల పంపిణీపై సీఎం స‌మీక్షించారు. గ‌తంతో పోలిస్తే ఎంతో నాణ్య‌మైన యూనిఫాంలు, ఆక‌ర్ష‌ణీయ‌మైన రంగులు, డిజైన్ల‌తో అంద‌జేశామని తెలిపారు. యూనిఫాంల‌తో పాటు టైలు, బెల్టులు, ఐడీ కార్డులు, షూలు, సాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, క‌టోరాలు, కార్పెట్లు, స్కూల్ బ్యాగుల పంపిణీ దాదాపు పూర్త‌యింద‌ని సమావేశంలో అధికారులు తెలియ‌జేశారు. ఒక‌ట్రెండు సంస్థ‌ల ప‌రిధిలో కొన్ని వ‌స్తువుల పంపిణీ 95 శాతం వ‌ర‌కు పూర్త‌యింద‌ని వివరించగా, ఆ వ‌స్తువుల పంపిణీని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

వ‌చ్చే ఏడాదికి విద్యార్థుల‌కు అంద‌జేసే యూనిఫాంలు, ఇత‌ర సామ‌గ్రికి సంబంధించి విధివిధానాల‌ను ( ఎస్‌వోపీ ) ఇప్పుడే రూపొందించాల‌ని స్పష్టం చేశారు. విద్యార్థుల‌కు అంద‌జేసే వ‌స్తువుల జాబితా రూప‌క‌ల్ప‌న‌ నుంచి, టెండ‌ర్లు, స‌ర‌ఫ‌రా, అంద‌జేత వ‌ర‌కు ప్ర‌తిదీ నిర్దేశిత స‌మ‌యంలో పూర్తి చేయాలని చెప్పారు. పాఠ‌శాల‌లు తెరిచిన రోజునే మొత్తం వ‌స్తువులు అందేలా ఇప్ప‌టినుంచే కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ఆదేశించారు. ఈ స‌మీక్ష‌లో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్‌, సంక్షేమ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌బ్య‌సాచి ఘోష్‌, రాష్ట్ర గిరిజ‌న‌, వెనుక‌బ‌డిన త‌ర‌గతుల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ రాహుల్ బొజ్జా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page