Thursday, November 5, 2026
No menu items!
HomeGREATER HYDERABADక్రీడ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు – మంత్రి పొన్నం ప్రభాక‌ర్‌

క్రీడ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు – మంత్రి పొన్నం ప్రభాక‌ర్‌

📰 Generate e-Paper Clip

బ‌షీర్‌బాగ్‌, న‌వంబ‌ర్ 4, ( అద్దం న్యూస్ ) :    తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. బుధ‌వారం ఎల్‌బి స్టేడియంలో ఆధునీకరించిన టెన్నిస్ కాంప్లెక్స్‌ను మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ లు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ఖేలో ఇండియా నిర్వహణ బాధ్యతలు తెలంగాణకు రావడం గర్వకారణం.. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియ‌చేస్తున్నామ‌న్నారు. ఖేలో ఇండియా క్రీడలను విజయవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని, సీఎం కప్, పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీ స్థాయిలో క్రీడా పోటీల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్న‌ట్లు తెలిపారు. నిరుపయోగంగా ఉన్న స్టేడియాలను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామ‌న్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్స్ ద్వారా తెలంగాణను దేశంలోనే స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం అని అన్నారు. ఖేలో ఇండియా విజయవంతానికి హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రిగా అన్ని శాఖల నుంచి పూర్తి సహకారం అందిస్తామ‌ని తెలిపారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మెట్రో వాటర్ వర్క్స్, పోలీస్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. క్రీడా పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లోనూ ఖేలో ఇండియా ఈవెంట్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించారు. కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ వంటి క్రీడా పాఠశాలలకు క్రీడా పోటీల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లా కేంద్రాలకే పరిమితం కాకుండా క్రీడాకారులకు అన్ని ప్రాంతాల్లో అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయనే అపోహ నుంచి యువత బయటకు రావాలని సూచించారు. క్రీడల్లో ప్రతిభ చూపితే ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యలో సీట్లు పొందే అవకాశాలు ఉన్నాయని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు.

క్రీడాకారుల విజయాల వెనుక క్రీడా ఉపాధ్యాయుల కృషి ఎంతో కీలకమ‌న్నారు. క్రీడా ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించి తెలంగాణకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని సూచించారు. ఖేలో ఇండియా నిర్వహణలో తెలంగాణ ఆతిథ్యాన్ని దేశం మొత్తం ప్రశంసించేలా సమష్టిగా కృషి చేద్దామ‌న్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి ,స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వాణి ప్రసాద్ , క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ సోనీ బాలదేవి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారి, శంకర్ గీతా కార్పొరేషన్ చైర్మన్, జంగా రాఘవ రెడ్డి ,ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page