అనుమతి లేకుండా నడిపిస్తున్న బన్సల్ అకాడమీ, నైన్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ల పై చర్యలు తీసుకోవాలి
– ఎస్ఎఫ్ఐ డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 19, అద్దం న్యూస్ : హైదరాబాద్ జిల్లా పరిధిలో అనుమతులు లేకుండా నడిపిస్తున్న బన్సల్ అకాడమీ, నైన్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ల పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అశోక్ రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్యకు వినతి పత్రాన్ని అందచేశారు. అనంతరం అశోక్‌రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్ జిల్లా పరిధిలో అకాడమీ పేర్లతో ఇంటర్ తరగతులను బన్సల్ అకాడమీ, నైన్ ఎడ్యుకేషన్ అకాడమీ పేరుతో అనుమతులు లేకుండా నగరంలో విచ్చలవిడిగా కాలేజీలు నిర్వహిస్తున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కాలేజీల్లోనే బాయ్స్, గర్ల్స్ హాస్టల్ నిర్వహిస్తున్నారన్నారు. అకాడమీల పేర్లతో జూనియర్ కాలేజీలను అదే బిల్డింగ్‌లో హాస్టల్స్ కూడా నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఎన్నోసార్లు విద్యాశాఖ అధికారులకు విన్నవించిన ఆ కళాశాలలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ అకాడమీ ల పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు స్టాలిన్, జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్ పాల్గొన్నారు.














Leave a Reply