...

బతుకమ్మ కుంట అభివృద్ధిని అడ్డుకుంటున్న బిఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి పై చర్య తీసుకోవాలి – సిపిఎం పార్టీ అంబ‌ర్‌పేట్ జోన్ క‌న్వీన‌ర్ మ‌హేంద‌ర్ డిమాండ్‌

 

 

బతుకమ్మ కుంట అభివృద్ధిని అడ్డుకుంటున్న బిఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి పై చర్య తీసుకోవాలి

– సిపిఎం పార్టీ అంబ‌ర్‌పేట్ జోన్ క‌న్వీన‌ర్ మ‌హేంద‌ర్ డిమాండ్‌

 

అంబ‌ర్‌పేట్‌, మే 13, అద్దం న్యూస్ :    కోర్టులో లిటిగేషన్ పేరుతో బతుకమ్మకుంట అభివృద్ధిని అడ్డుకుంటున్న బిఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి పై చర్య తీసుకోవాలని సిపిఎం పార్టీ అంబ‌ర్‌పేట్‌ జోన్ కన్వీనర్ మహేందర్ డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం అంబ‌ర్‌పేట్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మ‌హేంద‌ర్ మాట్లాడుతూ… అంబ‌ర్‌పేట్ మండల పరిధిలో ఉన్న బతుకమ్మ కుంట ఐదు ఎకరాల 10 కుంటల ప్రస్తుత భూమిలో చేపడుతున్న అభివృద్ధి చేయాలని అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు కృషి వల్ల హైడ్రా ఈ మధ్యకాలంలో అభివృద్ధిని చేపడుతుందన్నారు. ఈ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఎడ్ల సుధాకర్ రెడ్డి పై చర్య తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది కనుమరుగవుతున్న కుంటలు చెరువులని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కోరిందని గుర్తు చేశారు. కొందరు వ్యక్తులు హైకోర్టులో జహంగీర్ మరి కొందరు వ్యక్తులు కేసు వేయగా రాష్ట్ర హైకోర్టు విచారించి డబల్ బెంచ్ జస్టిస్ ఉజ్ఞాల్ భూయాన్ జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి కూడిన దుర్మాసనం బతుకమ్మకుంటలోని సర్వే నంబర్ 563/1, Ts 71 రాష్ట్ర ప్రభుత్వానిదే అని తీర్పు ఇచ్చిందన్నారు. సుధాకర్ రెడ్డి హైకోర్టు సివిల్ కోర్టు అనేక పిటిషన్లు కొట్టి వేసిందని…ఈ భూమికి సుధాకర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెప్పినదని… అయినప్పటికీ సుధాకర్ రెడ్డి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నందుకు అతనిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. 2003 నుండి 2025 వరకు బతుకమ్మకుంట చెరువుని మట్టితో పూడ్చినందుకు అతనిపై అనేక కేసులు అంబ‌ర్‌పేట్ పోలీస్‌స్టేష‌న్‌లో అనేక కేసులు ఉన్నాయని, ఆ కేసులు విచారించాల‌న్నారు. బతుకమ్మకుంట అభివృద్ధిని అడ్డుకుంటున్న బిఆర్ఎస్ నాయకుడు సుధాకర్ రెడ్డి వైఖ‌రి పై బిఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం కేటీఆర్ కానీ.. హరీష్ రావు వెంటనే స్పందించాలన్నారు. బతుకమ్మ కుంట చెరువులో వేసిన మట్టిని రీసైకిలింగ్ చేస్తున్న హైడ్రాకు అయ్యే ఖర్చును మొత్తం కూడా సుధాకర్ రెడ్డి నుండి వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేక‌రుల స‌మావేశంలో సిపిఎం పార్టీ జోన్ కమిటీ సభ్యులు జి.రాములు, బి.సుబ్బారావు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.