తెలంగాణ‌లో టిడిపి బ‌లోపేతానికి కార్య‌క‌ర్త‌లు కృషి చేయాలి – జూబ్లీహిల్స్‌లో టిడిపి పోటీ చేయాల‌ని తీర్మానం 

తెలంగాణ‌లో టిడిపి బ‌లోపేతానికి కార్య‌క‌ర్త‌లు కృషి చేయాలి  

– టిడిపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.అమర్‌ నాథ్

జూబ్లీహిల్స్‌లో టిడిపి పోటీ చేయాల‌ని తీర్మానం

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 19, అద్దం న్యూస్ :   తెలంగాణ‌లో టిడిపి బ‌లోపేతానికి కార్య‌క‌ర్త‌లు కృషి చేయాలని ఆ పార్టీ టిడిపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.అమర్‌ నాథ్అన్నారు. దోమ‌ల‌గూడ‌లోని హైద‌రాబాద్‌ జిల్లా టిడిపి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు, గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జ్ ఎం.అరవింద్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుక‌లు శుక్ర‌వారం జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబాతో క‌లిసి కె.అమర్‌ నాథ్ కేక్ క‌ట్ చేశారు. అనంత‌రం సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అడ‌హ‌క్ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో 25 వేల ఓటర్లకు ఒక క్లస్టరుగా, క్లస్టరు ఇన్చార్జులను నియమించడం, అదే విదంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి సమావేశంలో చర్చించారు. ఈ సంద‌ర్భంగా టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా లు మాట్లాడుతూ… రానున్న మన్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి కార్యకర్తలు ఉత్సాహంగా సంసిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలుగు దేశం పార్టీ తెలంగాణలో లేదని మాట్లాడే వారికి చెంపపెట్టులాగా దాదాపు రెండు లక్షల మందితో సభ్యత్వాలను పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్‌లోని 39 డివిజనులలో పూర్తి స్థాయిగా కమిటీలను నియమించుకోవడం జరిగిందన్నారు.                                                            దాంతో పాటు ప్రతి నియోజకవర్గంలోని ఓటరు జాబితా ప్రకారము, ప్రతి 25 వేల ఓటర్లకు ఒక క్లస్టరుగా నియోజకవర్గాల వారీగా క్లస్టరు ఇన్చార్జులను నియమించాలని సమావేశంలో సాయిబాబా ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం క్లస్టరు ఇన్చార్జులను వీలైనంత త్వరగా నియమించాలని నాయకులను కోరారు. అదే విధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేదని, జూబ్లీహిల్స్‌ నుండి గెలిచిన మాగంటి గోపీనాథ్ కూడా మన పార్టీకి చెందిన వారే అని అన్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో నేటికీ తెలుగుదేశం క్యాడర్ బలంగానే ఉందని సాయిబాబా అన్నారు. కాబట్టి అటువంటి బలమైన నియోజకవర్గంలో తెలుగుదేశమే పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవం తీర్మానం చేయడం జరిగింది. స్థానికంగా ఎవరికీ ఇచ్చినా అభ్యంతరం లేదని, కాని తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు నల్లెల్ల కిషోర్, బాలరాజగౌడ్, శ్రీపతి సతీష, జివిజి నాయుడు, ప్రమీల,ఎస్.ప్రకాష్, ఎబిఆర్ మోహన్, బాలకృష్ణ, బాలాజీ గోస్వామి, ఓ.వెంకటేష్ చౌదరి, కిరణ్, భానుప్రకాష్, సత్యనారాయణ, ఎం.రాజు, వెంకటస్వామి, గండికోట విజయ్, విఠ్టల్, మతిన్, సిహెచ్. ప్రదీప్ గౌడ్, వీరబాబు, ఎస్.ఎం. లయీఖుద్దీన్, సుక్రవేది, సత్తన్న తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page