GHMC/MMC/CMC ఎన్నికల వార్డుల రిజర్వేషన్ల పై
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను నమ్మకండి
అద్దం న్యూస్, వెబ్ డెస్క్ : GHMC/MMC/CMC ఎన్నికల వార్డుల రిజర్వేషన్ల పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పై జిహెచ్ఎంసి స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా తప్పు ప్రచారం అని, ప్రజలెవరూ నమ్మవద్దని జిహెచ్ఎంసి అధికారులు సోమవారం ( ఈ రోజు ) ఒక ప్రకటనను విడుదల చేశారు. జిహెచ్ఎంసి, ఎంఎంసి, సిఎంసి ఎన్నికల వార్డుల రిజర్వేషన్లకు సంబంధించి సోషల్ మీడియాలో, కొన్ని వెబ్ సైట్లల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, ప్రజలను తప్పదారి పట్టించేదిగా ఉందని జిహెచ్ఎంసి అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు GHMC గానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం గానీ వార్డు రిజర్వేషన్లపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదా జాబితాను విడుదల చేయలేదని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు సోషల్ మీడియా లేదా ఇతర వేదికలలో వస్తున్న నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మకండి, పంచుకోవద్దని సూచించారు. ఈ విషయానికి సంబంధించిన ఖచ్చితమైన, అధికారిక సమాచారానికి రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని సూచించారు. నమ్మే ముందు నిజమో, అబద్దమో అనేది నిర్ధారించుకోవాలని, ఫేక్ సమాచారాన్ని షేర్ చేయవద్దని అధికారులు కోరుతున్నారు.












Leave a Reply