హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్‌రెడ్డికి సన్మానం
హైదరాబాద్, డిసెంబర్ 11, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్‌రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించి ఒక సంవత్సరం అయినందున ఆయనకు గురువారం ఘనంగా జరిగింది. హైదరాబాద్ నగర గ్రంధాల సంస్థ కార్యదర్శి పొట్లూరీ పద్మజ, ఉద్యోగస్తులు, విశ్రాంత ఉద్యోగస్తులు, గ్రంథాలయ ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డిని సన్మానించారు. గ్రంథాలయ ఆవరణలో ఉన్న రేణుక ఎల్లమ్మ గుడిలో గ్రంథాలయ చైర్మన్ కెసిరెడ్డి ఉపేందర్‌రెడ్డి దంపతులు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగస్తులు వెంకటేశ్వర రెడ్డి, అవినాష్, వెంకటేష్ యాదవ్, బొల్లం మహేందర్, రామ్మోహన్, పిడి.మహేష్, గ్రేడ్ వన్ లైబ్రరీన్ చంద్రకళ, ప్రతిభారెడ్డి, శుక్లా దేవి, తారక రమేష్, జంగారెడ్డి, హరిబాబు, శ్రీనివాసు, వరప్రసాద్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోక్కుల దేవేందర్, చంద్రయ్య, తుమ్మ సత్యనారాయణ తదితరు ఉద్యోగస్తులు పాల్గొని ఉపేందర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ… గ్రంథాలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని, నూతనంగా నిర్మించిన గ్రంథాలయాలను త్వరలో ప్రారంభిస్తామన్నారు. విద్యార్థులకు గ్రంథాలయంలో కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని తెలిపారు.![]()

![]()














Leave a Reply