Monday, November 2, 2026
No menu items!
HomeGREATER HYDERABADజలమండలి మూడు రీజియన్లలో గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలు ప్రారంభం

జలమండలి మూడు రీజియన్లలో గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలు ప్రారంభం

📰 Generate e-Paper Clip

తెలంగాణ సచివాలయంలోనూ గ్రీన్ వాటర్ ట్యాంకర్లకు శ్రీకారం
– సచివాలయంలో రోజుకు 50 వేల లీటర్ల తాగునీటి పొదుపు లక్ష్యం
– గార్డెనింగ్ అవసరాలకు ఎస్‌టిపి నుంచి ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు

హైద‌రాబాద్ బ్యూరో, ( అద్దం న్యూస్ ) :    జలమండలి 37వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలను ప్రారంభించారు. ఇదే సందర్భంగా జలమండలి పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి రీజియన్లలోనూ గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలకు శ్రీకారం చుట్టారు. ఆయా ప్రాంతాల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు ( ఆపరేషన్స్ ), మునిసిపల్ అధికారులు సంయుక్తంగా ఈ సేవలను ప్రారంభించారు. ఎస్‌టిపిల్లో శుద్ధి చేసిన నీటిని గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్, నిర్మాణ పనులు తదితర తాగేతర అవసరాలకు వినియోగించడం ద్వారా తాగునీటిని సంరక్షించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

సచివాలయంలో 20 శాతం తాగునీటి పొదుపునకు చర్యలు :
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తాగునీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించేందుకు జలమండలి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సచివాలయానికి రోజుకు 2.50 లక్షల లీటర్ల ( 250 KLD ) తాగునీటిని సరఫరా చేస్తుండగా, అందులో 50 వేల లీటర్లు ( 50 KLD ) ఉద్యానవనాలు, పచ్చదనం నిర్వహణకు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్ అవసరాలకు తాగునీటికి బదులుగా ఎస్‌టిపిల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని నిర్ణయించారు. ఇందుకోసం 20 MLD సామర్థ్యం గల ఎస్టీపీ నుంచి సచివాలయానికి వారం రోజుల్లో ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్యల ద్వారా ప్రతిరోజూ 50 వేల లీటర్ల తాగునీటిని ఆదా చేయడంతో పాటు సచివాలయంలో మొత్తం తాగునీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించాలని జలమండలి లక్ష్యంగా పెట్టుకుంది.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page