Monday, November 2, 2026
No menu items!
HomeGREATER HYDERABADప‌ట్ట‌భ‌ద్రులు త‌మ ఓటును న‌మోదు చేసుకోండి – మాజీ కార్పొరేట‌ర్ వి.శ్రీనివాస్ రెడ్డి

ప‌ట్ట‌భ‌ద్రులు త‌మ ఓటును న‌మోదు చేసుకోండి – మాజీ కార్పొరేట‌ర్ వి.శ్రీనివాస్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ముషీరాబాద్‌, న‌వంబ‌ర్ 1, ( అద్దం న్యూస్ ) :

ప‌ట్ట‌భ‌ద్రులు త‌మ ఓటును న‌మోదు చేసుకోవాల‌ని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ వి.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌న‌గ‌ర్‌ పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో రాంన‌గ‌ర్ డివిజ‌న్ ఎస్ఆర్‌టి కాల‌నీలో గ‌ల ఓ చ‌ర్చీలో బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రేషం మ‌ల్లేష్ ఆధ్వ‌ర్యంలో ప‌ట్ట‌భ‌ద్రుల న‌మోదు కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఆదివారం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేట‌ర్ వి.శ్రీనివాస్‌రెడ్డి హాజ‌రై ప‌ట్ట‌భ‌ద్రుల‌తో ఓటును న‌మోదు చేయించారు. ఈ సంద‌ర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… ఈ నెల 6వ తేదీలోపు ప‌ట్ట‌భ‌ద్రులంద‌రూ త‌మ త‌మ ఓటును న‌మోదు చేసుకోవాల‌ని సూచించారు. ఓటర్ల నమోదు కోసం ఇచ్చిన గడువు సరిపోదని, దీనిని మ‌రికొన్ని రోజులు పొడిగించాలన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో చర్చి పాస్టర్ ప్రేమ్ కుమార్, పార్టీ నాయకులు ఆజం అలీ, సిరిగిరి శ్యామ్, రోహిత్, రాజేష్, బన్నీ అమిత్, సోను తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page