Monday, November 2, 2026
No menu items!
HomeGREATER HYDERABADఎస్ఐఆర్‌ను రద్దు చేయాలి – జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి

ఎస్ఐఆర్‌ను రద్దు చేయాలి – జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి

📰 Generate e-Paper Clip

ఢిల్లీ రామలీల మైదానంలో ఇండియా కూటమి భారీ బహిరంగ సభలో పాల్గొన్న
ఏఐవైఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర నాయకులు

న్యూఢిల్లీ, న‌వంబ‌ర్ 1, ( అద్దం న్యూస్ ) :    దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపును నిరసిస్తూ ఎస్ఐఆర్ ( SIR ) ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలోని రామలీల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఏఐవైఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి శ్రీమాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేర్లకంటి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని తీవ్రంగా ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను ఉపయోగించుకొని పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో లక్షలాది మంది ఓటర్ల పేర్లను ఓటరు జాబితాల నుంచి తొలగించారని విమర్శించారు. ఈ విధంగా పరోక్షంగా బీజేపీ అధికారంలోకి రావడానికి జ్ఞానేశ్ కుమార్ సహకరిస్తున్నారని ఆరోపించారు.

ఈ దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోందని, ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసేలా పేపర్ల దొంగతనం కూడా జరుగుతోందని వారు మండిపడ్డారు. ఎంపీలను అక్రమంగా కొనుగోలు చేస్తూ ప్రభుత్వాలను మార్చడం, రాజకీయ పార్టీలను చీల్చడం, పార్టీ గుర్తులను సైతం దొంగిలించే రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలు తమ ఓటు ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చడం, ప్రజాస్వామ్య విలువలను కాలరాయడం దేశ రాజకీయ వ్యవస్థకు ప్రమాదకరమని అన్నారు. దేశ వ్యాప్తంగా సుమారు 13 కోట్ల ఓట్ల తొలగింపునకు సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కాపాడాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని, జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని వారు కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం విద్యార్థి, యువజన సంఘాలు దేశ వ్యాప్తంగా ప్రజలను చైతన్యపరుస్తూ ఓటు హక్కు పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కళ్యాణ్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page