Wednesday, October 28, 2026
No menu items!
HomeGREATER HYDERABADఇంగ్లీష్ యూనియ‌న్ హై స్కూల్‌లో గాంధీ జ‌యంతి – గాంధీ వేష‌ధార‌ణ‌లో ఆక‌ట్టుకున్న విద్యార్థులు

ఇంగ్లీష్ యూనియ‌న్ హై స్కూల్‌లో గాంధీ జ‌యంతి – గాంధీ వేష‌ధార‌ణ‌లో ఆక‌ట్టుకున్న విద్యార్థులు

📰 Generate e-Paper Clip

క‌వాడ‌గూడ‌, అక్టోబర్ 2, ( అద్దం న్యూస్ ) :    హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ ఇంగ్లీష్ యూనియ‌న్ హై స్కూల్ లో మ‌హాత్మాగాంధీ జ‌యంతి కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా విద్యార్థులు గాంధీజి వేష‌ధార‌ణ‌లో విశేషంగా ఆక‌ట్టుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి స్కూల్ కరస్పాండెంట్ పులిగారి గోవ‌ర్థ‌న్ రెడ్డి హాజ‌రై గాంధీ చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… మనం కేవలం గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేయడంతో సరిపెట్టకూడదు… ఆయన నడిచిన నడకను, ఆయన ఆలోచనలను మన దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టాలన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలను విడనాడి, దేశాభివృద్ధి కోసం ఐకమత్యంతో ముందుకు సాగుదామ‌న్నారు. గాంధీజీ ఆశయాలను కొనసాగిస్తామని మనందరం ప్రతిజ్ఞ చేద్దామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో స్కూల్ ప్రిన్సిపాల్ స్వ‌ర్ణ‌ల‌త‌, ఉపాధ్యాయులు, విద్యార్థీని, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page