Wednesday, October 28, 2026
No menu items!
HomeGREATER HYDERABADగాంధీజీ చెప్పిన సత్యం, అహింస, జాలి అనేవి మానవాళికి స్ఫూర్తినిస్తాయి – మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు...

గాంధీజీ చెప్పిన సత్యం, అహింస, జాలి అనేవి మానవాళికి స్ఫూర్తినిస్తాయి – మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ

📰 Generate e-Paper Clip

ముషీరాబాద్, అక్టోబర్ 2, ( అద్దం న్యూస్ ) :    గాంధీజీ చెప్పిన సత్యం, అహింస, జాలి ( కరుణ ) అనే గుణాలు ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ అన్నారు. మ‌హాత్మాగాంధీ జ‌యంతి కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్‌లోని ద‌త్తాత్రేయ నివాసంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో బండారు ద‌త్తాత్రేయ హాజ‌రై గాంధీజి చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ( వికసిత్ భారత్ ) నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అలాగే గాంధీజీ ఆశయాలైన శాంతి, ఐక్యత, దేశ భక్తి, దేశ సేవలను ప్రజలంతా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

మహాత్మా గాంధీ ఆలోచనలు ప్రపంచం మొత్తానికి స్ఫూర్తినిచ్చాయని, మానవత్వం ఉన్నంత కాలం వారి మాటలు ఎప్పటికీ ఉపయోగపడతాయని తెలిపారు. గాంధీజీ స్వదేశీ వస్తువుల వాడకాన్ని ముఖ్యంగా ఖాదీని ఎంతగానో ప్రోత్సహించారని గుర్తుచేశారు. బాపూజీ ఇచ్చిన గొప్ప సందేశం మన సమాజాన్ని మంచి భవిష్యత్తు వైపు, వికసిత్ భారత్ వైపు నడిపిస్తుందని దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర బిజెపి నాయ‌కుడు రొయ్యూరు శేష‌సాయి, బిజెపి అడిక్‌మెట్ డివిజ‌న్ అధ్య‌క్షుడు సాయి కృష్ణ యాద‌వ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page