లాలాగూడలో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు
తార్నాక, అక్టోబర్ 2, ( అద్దం న్యూస్ ) : సత్యం, అహింస సిద్ధాంతాలతో దేశ స్వాతంత్య్ర పోరాటానికి మహాత్మాగాంధీ కొత్త దిశ చూపారని సికింద్రాబాద్ టీడీపీ ఇన్‌చార్జి వల్లారపు శ్రీనివాస్‌కుమార్ అన్నారు. లాలాగూడ శాంతినగర్‌లో టీడీపీ అడ్డగుట్ట డివిజన్ అధ్యక్షుడు కాతా విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వల్లారపు శ్రీనివాస్‌కుమార్ గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… దేశానికి స్వాతంత్య్రం సాధించడంతో పాటు ప్రజలకు స్వేచ్ఛా ఫలాలను అందించాలనే లక్ష్యంతో గాంధీజీ సత్యం, అహింస మార్గాలను ఎంచుకున్నారని తెలిపారు.
బ్రిటిష్ పాలకులు ఎన్నో ఇబ్బందులకు గురిచేసినా ఆయన తన సిద్ధాంతాలను విడిచిపెట్టలేదన్నారు. సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాలతో ప్రజలను చైతన్యపరిచి స్వాతంత్య్ర పోరాటాన్ని ముందుకు నడిపారని పేర్కొన్నారు. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన గాంధీజీ ఆదర్శాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పరిటాల విజయ్‌కుమార్, జిఎం. రమేష్, రాజు నాయక్, ఎర్ర నాగార్జున, బొల్లు సురేష్, నవీన్, లక్ష్మయ్య, అంబాల రమేష్, వెంకటస్వామి, పుప్పాల విజయకుమార్, జగదీష్ గౌడ్, రాజు చౌహన్, శేషిరెఖ, చందర్ ముదిరాజ్, మురళి, రామారావు, ప్రసాదరావు, విక్రమ్, టైలర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






