కవాడిగూడ, నవంబర్ 13, ( అద్దం న్యూస్ ) :
భారతదేశం తరపున చైనాలోని సాంఘైలో జరిగిన అంతర్జాతీయ వరల్డ్ స్కిల్స్ పోటీల్లో తెలంగాణలో చెందిన కేసోజు యశ్వంత్ చారి వడ్రంగి విభాగంలో విశేష ప్రతిభ కనబరచి “మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ ” బంగారు పతకం సాధించారు. ప్రపంచ స్థాయిలో జరిగిన పోటీల్లో యశ్వంత్ చారి ఐదవ స్థానంలో నిలిచాడు. ప్రధాన మంత్రి అభినందిస్తూ ఆర్థిక వితరణ కూడా ఇచ్చారు. బంగారు పతకం సాధించిన విద్యార్థి యశ్వంత్ చారి ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్‌లో పదవ తరగతి వరకు చదివి ఎన్‌సిసి లో పాల్గొని విజయం సాధించాడు. ఈ సందర్భంగా యశ్వంత్ చారికి ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలతా రెడ్డి, కరస్పాండెంట్ పులిగారి గోవర్ధన రెడ్డి, ఉపాధ్యాయులు సంగీత, అనిత, ప్రసన్న, పాఠశాల విద్యార్థులు సన్మానించి హృదయపూర్వకంగా అభినందించారు.








