హైదరాబాద్, జూన్ 11, అద్దం న్యూస్ : ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా ప్రారంభించిన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద గల మాంగళ్య షాపింగ్ మాల్‌ను జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు బుధవారం సీజ్ చేశారు. టౌన్‌ప్లానింగ్ అదనపు చీఫ్ సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ భార్గవి, సర్కిల్-15 టౌన్ ప్లానింగ్ ఏసిపి దేవేందర్, పోలీసు అధికారుల సహకారంతో మాంగళ్య షాపింగ్ మాల్‌ను సీజ్ చేశారు. జీహెచ్ఎంసీ 1955 అండర్ సెక్షన్ 461 ( ఏ ) ప్రకారం మాంగళ్య షాపింగ్ మాల్‌ను సీజ్ చేశారు. ఆక్యూపెన్సి సర్టిఫికెట్ జారీ చేసిన తర్వాతనే భవనాలలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించాలని, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తే జిఓ.168 ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply