Crime News: కాలువలో పడి వివాహిత మృతి.. కుమారుడి గల్లంతు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ :  పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో కాలువలో పడి వివాహిత మృతి చెందగా, ఆమె కుమారుడు గల్లంతైన ఘటన పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో చోటు చేసుకుంది. రొంపిచర్ల మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన శ్రీకాంత్ కుమారుడు శరత్‌(7 నెలలు) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో శుక్రవారం రాత్రి అతడు.. కుమారుడు, భార్య త్రివేణి(25)తో కలిసి నరసరావుపేటలోని ఆసుపత్రికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఉన్న కాలువ వద్ద బొలెరో వాహనం అడ్డు రాగా దాన్ని తప్పించబోయి బైక్‌ అదుపుతప్పి పడిపోయింది. దీంతో శరత్, త్రివేణి కాలువలో పడ్డారు. శ్రీకాంత్‌ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు వచ్చి గాలింపు చేపట్టగా త్రివేణి మృతదేహం లభ్యమైంది. శరత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భార్యను, కుమారుడిని భర్త హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నట్లు వివాహిత కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page