...

శిథిలావస్థలో ఉన్న భవనాన్ని అభివృద్ధి చేసి ప్రీ ప్రైమరీ, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించాలి – మాజీ ఎమ్మెల్సి న‌ర్సిరెడ్డి

శిథిలావస్థలో ఉన్న భవనాన్ని అభివృద్ధి చేసి ప్రీ ప్రైమరీ, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించాలి
– మాజీ ఎమ్మెల్సి న‌ర్సిరెడ్డి

ఆజంపుర, ఏప్రిల్ 16, అద్దం న్యూస్ :  శిథిలావస్థలో ఉన్న భవనాన్ని అభివృద్ధి చేసి ప్రీ ప్రైమరీ, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్సి న‌ర్సిరెడ్డి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆజంపుర కాలడేర కాలనీలో గ‌ల ప్ర‌భుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, స్టేషన్ డ‌బీర్‌పుర గురువారం మాజీ ఎమ్మెల్సీ, పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఇరుకు గదులలో నడవడం పాఠాలు బోధించేందుకు వీలులేని తరగతి గదిలో చూసి ఆశ్చర్యపోయారు. ఒకటి నుండి 10వ తరగతి వరకు నడుస్తున్న ఈ పాఠశాలలో నిపుణులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు న్యాయమైన విద్యను అందిస్తున్నారని ఆయన ప్రశంసించారు.

గతంలో ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలకు ఉపయోగించిన ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడం వల్ల పాఠశాల నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని, ప్రస్తుతం ఉర్దూ మీడియాలో జరుగుతున్న బోధనకు అదనంగా ప్రీ ప్రైమరీ నుండి ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పాఠశాలను పూర్తిస్థాయిలో నడపాలంటే ప్రస్తుతం ఉన్న స్కూల్‌కు ఎదురుగా ఉన్న బి-23, బి-7 బ్లాక్‌ల‌ను పాఠశాలకు కేటాయించి ఒకే బ్లాక్ బి 23 లో పాఠశాలను నిర్మాణం, బి 7లో ఆట స్థలానికి కేటాయించినచో ఇక్కడే అద్భుతమైన పాఠశాల నిర్మాణం జరుగుతుందని అన్నారు.

ఈ పాఠశాల చుట్టుప్రక్కల చాలా మంది దారిద్య్ర‌ రేఖకు దిగువ ఉన్నవారు, మధ్య తరగతి కుటుంబాలే నివ‌సిస్తున్నార‌ని, వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చేరాలంటే దాదాపు రెండు నుండి మూడు కిలోమీటర్ల ట్రాఫిక్‌లో ప్రయాణిస్తే గాని ప్ర‌భుత్వ పాఠశాలలు లేవన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టలేక అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీటన్నిటికీ పరిష్కారం దొరకాలంటే పాఠశాల ముందు పక్కన ఉన్న బి 23, బి 7 ( కాలడేర కాల‌నీలో )లో బ్లాక్స్‌ను పాఠ‌శాల‌లో కేటాయించిన రూ.10 కోట్ల నిధుల‌తో బ‌హుళ అంత‌స్తు భ‌వ‌న నిర్మాణాన్ని వెంట‌నే నిర్మించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పౌర స్పంద‌న వేదిక రాష్ట్ర కార్య‌ద‌ర్శి లక్ష్మ‌ణ‌రావు, కార్యనిర్వాహ‌క సభ్యుడు మాణిక్ రెడ్డి, వేదిక హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంఎ.స‌మ‌ద్‌, తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహమ్మద్ అబ్దుల్లా, సయ్యద్ రహమతుల్లా, పాఠశాల ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.