Wednesday, October 28, 2026
No menu items!
HomeEducationప్రైవేట్ జూనియర్ కళాశాలలపై రూ.5.44 కోట్ల జరిమానా రద్దు చేయాలి – తెలంగాణ ప్రైవేట్ జూనియర్...

ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై రూ.5.44 కోట్ల జరిమానా రద్దు చేయాలి – తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరీ సతీష్

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, అక్టోబర్ 24, ( అద్దం న్యూస్ ) :     తెలంగాణలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై ఇంటర్మీడియట్ బోర్డు విధించిన రూ.5.44 కోట్ల జరిమానాలను రద్దు చేయాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరీ సతీష్ డిమాండ్ చేశారు. అర్హత ఉన్న కళాశాలలకు పెండింగ్‌లో ఉన్న అనుబంధ గుర్తింపులను వెంటనే మంజూరు చేయాలని, బోర్డు ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో శ‌నివారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో గౌరీ స‌తీష్ మాట్లాడుతూ… 2025–26 విద్యా సంవత్సరానికి 544 ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు ఒక్కొక్కదానికి రూ.లక్ష చొప్పున రూ.5.44 కోట్ల జరిమానా విధించడం అన్యాయమని అన్నారు. ఏవైనా లోపాలు ఉంటే ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి, యాజమాన్యాల వివరణ తీసుకున్న తర్వాతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నకిలీ ధ్రువపత్రాల సమర్పణకు సంబంధించి 79 కళాశాలలపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

సంబంధిత అధికారుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం 52 కళాశాలలు సరైన ధ్రువపత్రాలు సమర్పించాయని తెలిపారు. ధ్రువపత్రాల ప్రామాణికతపై అనుమానాలు ఉంటే వాటిని జారీ చేసిన శాఖల పాత్రను కూడా పరిశీలించాలని అన్నారు. రాష్ట్రంలో 1,432 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా, 1,256 కళాశాలలకు గుర్తింపు ఇచ్చారని వివరించారు. అక్టోబర్ 24 నాటికి 158 కళాశాలలకు గుర్తింపు పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డులో ఆర్థిక లావాదేవీలు, కళాశాలల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వినియోగంపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేట్ కళాశాలల విషయంలోనే కాకుండా కార్పొరేట్ విద్యాసంస్థల విషయంలోనూ నిబంధనలను సమానంగా అమలు చేయాలని అన్నారు. జరిమానాలను రద్దు చేసి, పెండింగ్ గుర్తింపులను త్వరగా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు వరదారెడ్డి, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజెస్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.జనార్దన్ రెడ్డి, శ్రావణ్ కుమార్, సుధాకర్ రెడ్డి, వీరారెడ్డి, కోశాధికారి పార్థసారథి, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page