ముషీరాబాద్, అక్టోబర్ 23, ( అద్దం న్యూస్ ) : ఇచ్చిన మాట ప్రకారం 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను పేదలకు అందచేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి ప్రధాన కార్యదర్శి మారిశెట్టి నర్సింగ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకాన్ని శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించారు. గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు సాయికీర్త్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మారిశెట్టి నర్సింగ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పేద ప్రజలను కలిసి వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం గురించి అవగాహన చేసి, పథకానికి సంబంధించిన పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా నర్సింగ్‌రావు మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన గృహ వినియోగదారులకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందన్నారు. ఈ పథకం వల్ల లక్షలాది కుటుంబాలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గి ఆర్థిక ఉపశమనం లభిస్తోందని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్ కుమార్ యాదవ్ ల ఆదేశాల మేరకు గృహజ్యోతితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందచేస్తున్న ప్రభుత్వం – కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి ప్రధాన కార్యదర్శి మారిశెట్టి నర్సింగ్‌రావు
RELATED ARTICLES






