...

నిరంతర పోరాట స్ఫూర్తి భీమిరెడ్డి నరసింహారెడ్డి – ఎంసిపిఐ ( యు ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వనం సుధాకర్

 

నిరంతర పోరాట స్ఫూర్తి భీమిరెడ్డి నరసింహారెడ్డి
– ఎంసిపిఐ ( యు ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వనం సుధాకర్

 

హైదరాబాద్, మే 9, అద్దం న్యూస్ :   నిరంతర పోరాట స్ఫూర్తి భీమిరెడ్డి నరసింహారెడ్డి అని ఎంసిపిఐ ( యు ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వనం సుధాకర్ అన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ పార్లమెంటు సభ్యులు, ఎంసిపిఐ(యు) పొలిట్ బ్యూరో సభ్యులు, అమరజీవి భీమిరెడ్డి నరసింహారెడ్డి (బిఎన్) 17వ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లి ఓంకార్ భవన్‌లో ఎంసిపిఐ ( యు ) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటి సభ్యులు తుడుం అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్ ముందుగా బిఎన్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించి మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం పాలన ను ఎదురొడ్డి తుపాకీ చేతపట్టి పోరాడిన విప్లవ యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి అని అన్నారు. నాటి తెలంగాణ పల్లెల్లో భూస్వాముల చెంతన ఉన్న భూములను పేదలకు పంచడానికి దున్నేవానికి భూమి కావాలని మొదటిసారిగా నినాదం ఇచ్చిన వీరుడు బిఎన్ అని కొనియాడారు. 1946 నుండి 1951 వరకు జరిగిన మహోత్తర పోరాటం వీర తెలంగాణ సాయుధ పోరాటంలో ఆరంభం నుండి అనంతం వరకు ఆయుధం చేతపట్టి అలుపెరుగని పోరాటం చేశారని, భూస్వాముల దొరల ఆగడాలను అడ్డుకట్ట వేసి వెట్టి చాకిరిని నిర్మూలిస్తూనే పది లక్షల సాగు భూమిని ప్రజలకు పంచి 4 వేల గ్రామాలను ప్రజా పాలన గావించిన ఘనత భీమిరెడ్డి నరసింహారెడ్డిద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట కమిటి సభ్యులు జి. మల్లేశ్,తుడుం అనిల్ కుమార్, పుష్ప, పల్లె మురళి, ఇ.దశరథ్ నాయక్, యాదగిరి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కుంభం సుకన్య, రాష్ట్ర కమిటీ సభ్యులు తాండ్ర కళావతి, పి.భాగ్యమ్మ, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు వై రాంబాబు, కిష్టయ్య, సభ్యులు టి.పుష్పలత, జి.సునీత, లలిత, పార్వతి, రాజు, నరసింహ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.