Wednesday, October 28, 2026
No menu items!
HomeGREATER HYDERABADగాంధీజీ ఆశయాలను స్ఫూర్తిని తీసుకుని దేశ అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాలి – తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల...

గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిని తీసుకుని దేశ అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాలి – తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, అక్టోబర్ 2, ( అద్దం న్యూస్ ) :    గాంధీజీ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధి, ప్రజాసేవ, సామాజిక బాధ్యతలో భాగస్వాములు కావాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గం తార్నాకలో చింతల్ కాంగ్రెస్ నాయకుడు కిట్టు ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మోతే శోభన్ రెడ్డి మాట్లాడుతూ… మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి, సామాజిక సమానత్వం మార్గాలు నేటి సమాజానికి కూడా ఎంతో ప్రాసంగికమని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి అహింసా మార్గంలో పోరాటాన్ని నడిపించిన తీరు దేశ చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page