Wednesday, October 28, 2026
No menu items!
HomeGREATER HYDERABADఅవినీతి అధికారుల చిట్టాను ఏసిబికి అందజేస్తాం

అవినీతి అధికారుల చిట్టాను ఏసిబికి అందజేస్తాం

📰 Generate e-Paper Clip

మిల్లర్లపై కేసులు సరే… అధికారుల సంగతేంటి..?
– మిల్లర్ల అవినీతిలో డిఎస్ఓ, డిఎంల ప్రమేయం లేదా ?
– అధికారుల పాత్రపై కూడా విచారణ చేపట్టాలి
• బీసీ పొలిటికల్ జేఏసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్

హైద‌రాబాద్ బ్యూరో, అక్టోబర్ 26, ( అద్దం న్యూస్ ) :    రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన సివిల్ సప్లయ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి అక్రమాస్తులు కూడా జప్తు చేయాలని బీసీ పొలిటికల్ జేఏసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం హైద‌రాబాద్ బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… ఇటీవల రాష్ట్రంలో మిల్లర్లపై జరుగుతున్న దాడులు, కేసుల నమోదు వంటి అంశాలను బీసీ పొలిటికల్ జేఏసి స్వాగతిస్తుందని అన్నారు. అధికారుల సహకారం, అండదండలు లేకుండా మిల్లర్లు సొంతంగా అవినీతికి ఎలా పాల్పడతారని ప్రశ్నించారు. నేడు సివిల్ సప్లయ్ శాఖలో కోట్ల రూపాయల అవినీతి బాగోతం కొనసాగుతుందంటే అందుకు ప్రధాన కారణం అవినీతి అధికారులు కాదా ? అని నిలదీశారు. ఇటీవల వనపర్తి జిల్లాలో అనుమతులు లేవంటూ రెండు రైస్ మిల్లులను కూల్చివేశారని గుర్తు చేస్తూ, అనుమతులు లేని రైస్ మిల్లులకు ధాన్యం ఎలా కేటాయించారు ? మిల్లింగ్ అనుమతులు ఎవరు ఇచ్చారని, ఈవిధమైన అవినీతి చర్యలకు అధికారులు కారణం కాదా అని రాచాల యుగంధర్ గౌడ్ ప్రశ్నించారు.

రాష్ట్రంలో సివిల్ సప్లయ్ శాఖలో పనిచేస్తున్న అనేక మంది డిఎం, డిఎస్ఓలు కోట్లకు పడగెత్తుతున్నారని, ఒక్క సీజన్‌లో ఒక్కో అధికారి రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు అక్రమంగా సంపాదించుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అవినీతి అధికారుల అవినీతి చిట్టాను త్వరలో ఎసిబికి అందజేస్తామని, మిల్లర్లపై జరుగుతున్న దాడుల విధంగానే అధికారులపై కూడా సోదాలు నిర్వహించాలని, వారి అక్రమాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, వారి బినామీలు ఎవరో గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి అధికారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని, అక్రమ సంపాదన ఒక్కటే కాకుండా ధాన్యం సేకరణ, గన్నీ బ్యాగులు, ట్రక్ షీట్లు, ధాన్యం నిల్వలు, టెండర్ ప్రక్రియ, రవాణా బిల్లులు, బ్యాంకు చెల్లింపులు, స్టాక్ ధ్రువీకరణ పత్రాలు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాల వంటి వ్యవహారాలలో అధికారులు అనేక అవకతవకలకు పాల్పడుతూ అవినీతిలో కూరుకుపోతున్నారని అన్నారు. అవినీతి అధికారుల భరతం పట్టే వరకు బీసీ పొలిటికల్ జేఏసీ విశ్రమించదని, ప్రభుత్వం అవినీతి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసి నాయకులు వివి.గౌడ్, దేవర శివ, సిద్ధార్థ్, శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page