ఆమెనే భారత తదుపరి కెప్టెన్‌‌గా నియమించాలి..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారత మహిళల తదుపరి కెప్టెన్‌గా జెమీమా రోడ్రిగ్స్‌ (Jemimah Rodrigues)ను నియమించాలని సౌతాఫ్రికా క్రికెటర్ మరిజన్నే కాప్ సూచించింది. హర్మన్‌ప్రీత్ కౌర్‌కు సరైన వారసురాలు జెమీమానేనని అభిప్రాయపడింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 నేపథ్యంలో జెమీమా రోడ్రిగ్స్‌ (Jemimah Rodrigues)ను ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్‌గా నియమించింది. గత మూడు సీజన్లలో మెగ్ లాన్నింగ్ ఢిల్లీని నడిపించగా.. ఈసారి ఆమె యూపీ వారియర్స్‌కు వెళ్లిపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

దేశవాళీ క్రికెట్‌లో ముంబై మహిళల జట్టుకు జెమీమా (Jemimah Rodrigues) సారథ్యం వహిస్తుంది. అయితే ఆమె ఇప్పటి వరకు భారత జట్టుతో పాటు డబ్ల్యూపీఎల్‌లో సారథిగా పనిచేయలేదు. అయినా జెమీమాలో సారథ్య లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఆమె సహచర ఢిల్లీ ప్లేయర్ అయిన మరిజన్నే కాప్ చెప్పుకొచ్చింది.

‘జెమీమా రోడ్రిగ్స్‌ను భారత తదుపరి కెప్టెన్‌గా నియమించాలని నేను రెండేళ్ల క్రితమే చెప్పాను. ఆమెలో సారథ్య లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆమె వ్యక్తిత్వం, అందరినీ కలుపుకొనిపోయే తీరు, ఇతరుల పట్ల చూపించే శ్రద్ద కెప్టెన్‌గా నిలబెడుతాయి. ఎంతో అనుభవం ఉన్న కెప్టెన్లు కూడా కొన్నిసార్లు సవాళ్లను ఎదుర్కొంటారు. జెమీమా చుట్టూ ఇప్పుడు చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. ఆమె ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటుందని నేను భావిస్తున్నాను. ఐదు సార్లు ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్‌గా.. డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా గుర్తింపు పొందింది. జనవరి 9 నుంచి డబ్ల్యూపీఎల్ 2026 సీజన్‌కు తెరలేవనుండగా.. జనవరి 10న ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page