అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానం ఎఫ్-16సి ఫైటర్ జెట్ (F16 Fighter Jet) కుప్పకూలింది. అయితే ఈ ఘటనలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. యుద్ధవిన్యాసాల ప్రదర్శనల స్క్వాడ్రన్‌గా పిలిచే ‘థండర్‌బడ్స్’ చెందిన ఈ ఫైటర్ జెట్ దక్షిణ కాలిఫోర్నియాలోని ఎడారిలో నేలను ఢీకొట్టగా ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రోనా ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని ఈఘటన జరిగిన్నట్టు అధికారులు తెలపారు. ఈ ఘటనతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించాయి.
అయితే విమానం కుప్పకూలకముందే ఫైలట్ ఫ్లైట్ నుంచి పారాచ్యూట్ సహాయంతో బయటపడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్వల్ప గాయాలు అయిన పైలట్‌ను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఎఫ్-16 ఫైటర్ పాల్కన్ జెట్లతో ఈ ప్రాంతంలో తరచూ అమెరికా ఎయిర్ ఫోర్స్ నిరంతరం యుద్ధవిన్యాసాల శిక్షణ చేపడుతుంది. మొత్తం 6 థండర్‌బడ్స్ జెట్స్ శిక్షణలో ఉండగా, ఒకటి మాత్రం కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply