హైదరాబాద్, మే 17, అద్దం న్యూస్ : అమ్మను మించిన దైవము లేదని… మాతృదేవోభవ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం అమ్మ అని టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో – కన్వీనర్, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవోప మహిళ విభాగ్ ఆధ్వర్యంలో పద్మరాగ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కెపిహెచ్‌బిలో టిఎస్ అవోప మహిళ విభాగం అధ్యక్షురాలు శిల్పా అధ్వర్యంలో జరిగిన వేద ఆశీర్వాదం, పాద పూజ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల శ్రీనివాస్ గుప్త హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ఆటల్లో గెలుపొందిన మహిళ సోదరీమణులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అవోప రాష్ట్ర అధ్యక్షురాలు మలిపెద్ది శంకర్, ఆర్గనైజర్ కార్యదర్శి కట్ట రవి కుమార్ గుప్త, ఐవిఎఫ్ బాచుపల్లి అధ్యక్షుడు నవీన్, ప్రధాన కార్యదర్శి పోల శ్రీధర్, పృధ్వీ రాఘువంశి, పువ్వాడ హారిక, ప్రోగ్రామ్ ఛైర్మన్, టిఎస్ అవోప ప్రధాన కార్యదర్శి ప్రియాంక, కోశాధికారి పద్మజ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply