Chiranjeevi Hook Step Song: ‘హుక్ స్టెప్’తో ఊపేసిన మెగాస్టార్..

Chiranjeevi Hook Step Song: ‘హుక్ స్టెప్’తో ఊపేసిన మెగాస్టార్..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకి భీమ్స్ సిసిరీలియో సంగీతం సమకూర్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ మూవీ వచ్చిన పాటలన్నీ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఈ క్రమంలో ప్రీరిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన ‘హుక్ స్టెప్’ సాంగ్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. భీమ్స్ కంపోజ్ చేసిన ఈ డ్యాన్స్ నంబర్ కి చిరంజీవి తన హుక్ స్టెప్పులతో అదరగొట్టారు. వింటేజ్ మెగాస్టార్ ని గుర్తు చేశారు.

మెగాస్టార్ చిరంజీవి ‘హుక్ స్టెప్’ పాటతో అభిమానులను అలరించారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలోని ఈ పాట తాజా రిలీజ్ అయింది. 30 ఏళ్ల తర్వాత బాబా సెహగల్.. చిరంజీవి కోసం పాడిన పాట ఇది. భీమ్స్ సిసిరీలియో సంగీతం అందించిన ఈ డ్యాన్స్ నంబర్ కు ఆటా సందీప్-జ్యోతి రాజ్ కొరియోగ్రఫీచేశారు. జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. 1995లో వచ్చిన ‘రిక్షావోడు’ సినిమాలో ‘రూప్ తేరా మస్తానా’ అనే సాంగ్ పాడిన బాబా.. దాదాపు 30 ఏళ్ల తర్వాత చిరంజీవి కోసం పాట పాడారు. తన ఎనర్జిటిక్ వాయిస్ తో అలరించారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకి లిరిక్స్ రాశారు. ఆటా సందీప్, జ్యోతి రాజ్ దంపతులు ఈ పాటకి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు.

https://x.com/KChiruTweets/status/2008920044881990069?s=20

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page