Tuesday, November 17, 2026
No menu items!
HomeGREATER HYDERABADహౌస్ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

హౌస్ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

📰 Generate e-Paper Clip

తార్నాక, నవంబర్ 14, ( అద్దం న్యూస్ ) :  కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్, రాహుల్ గాంధీ పర్యటనకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన తనను, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్టు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తీవ్రంగా ఖండించారు. శనివారం ఉదయం ఆరు గంటల నుంచే తన నివాసం వద్ద పోలీసులు మోహరించి బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ సమ్మిట్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే కార్యక్రమం కాదని, భారత అంతర్గత రాజకీయ అంశాలను విదేశీయులతో చర్చించేందుకే కాంగ్రెస్ ఈ సదస్సును నిర్వహిస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా తప్పుడు ప్రచారం చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టారని విమర్శించారు. దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. 

      నిరుద్యోగులకు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, రైతులకు రైతుబంధు, రైతుభరోసా అందడం లేదని ఆరోపించారు. హామీలపై రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, యువమోర్చా కార్యకర్తలు నల్లజెండాలతో నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. పోలీసుల నిర్బంధాలకు భయపడేది లేదని, హౌస్ అరెస్టులతో తమ ఉద్యమాన్ని అడ్డుకోలేరని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page