బషీర్‌బాగ్, నవంబర్ 14, ( అద్దం న్యూస్ ) : మూతపడిన ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభించాలని రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఖాళీగా ఉన్న 35 వేల ఉపాధ్యాయ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 14 బిసి సంఘాలు, నిరుద్యోగ సంఘాల సమావేశానికి నిరుద్యోగ జెఎసి చైర్మన్ నీల వెంకటేష్, జక్కుల చిన్న జంగయ్య యాదవ్ అధ్యక్షతన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం జరిగింది. శనిఆరం జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ… గత సంవత్సరం టీచర్ పోస్టులను భర్తీ చేశారు.. కానీ, వివిధ కారణాలతో టీచర్ పోస్టులను భర్తీ కాలేదన్నారు. ఇంకా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయని, ఆ తర్వాత వేలాది మంది రిటైర్ అయ్యారన్నారు. ఇంకొక వైపు లక్షలాది మంది నిరుద్యోగుల ఉద్యోగాలు లేక రోడ్ల వెంట తిరుగుతూ, శక్తి- యుక్తులు వృధా చేసుకుంటున్నారన్నారు. టీచర్ పోస్టులు భర్తీ సైన్ చేయని 12 వేల పాఠశాలలో ఇంగ్లీష్, మథ్స్, పాఠాలు చెప్పేవారు లేరని… విద్యార్థులకు ఈ సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం లేక చదువులలో వెనుకబడిపోతున్నారని తెలిపారు.
పోటీలో బేసిక్ విషయ పరిజ్ఞానం లేక జాతీయ స్థాయి పోటీలలో నీట్, పరీక్ష, మెడిసిన్ మొదలైన పోటీ పరీక్షలలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని, మూతపడిన పాఠశాలలను పునఃప్రారంభించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
నాణ్యమైన విద్య అందించేందుకు అర్హులైన ఉపాధ్యాయులను నియమించాలని, విద్యావంతులైన నిరుద్యోగ యువత సేవలను విద్యారంగ అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ రాజేందర్ ముదిరాజ్, బీసీ కులాల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి.అనంతయ్య, బిసి కులా వేదిక రాష్ట్ర విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పర్లగొర్ల మోది రాందేవ్ యాదవ్, అంజి గౌడ్, బిసి ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షుడు భీమరాజు, బిసి నాయకులు శివ కుమార్ యాదవ్, నరేష్ గౌడ్, శ్రీశైలం, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.








