Tuesday, November 17, 2026
No menu items!
HomeGREATER HYDERABADకొత్తపల్లి - హుస్నాబాద్ మధ్య రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కొత్తపల్లి – హుస్నాబాద్ మధ్య రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

📰 Generate e-Paper Clip

రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి
– రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి

హుస్నాబాద్, న‌వంబ‌ర్ 10, ( అద్దం న్యూస్ ) :      కొత్తపల్లి – హుస్నాబాద్ మధ్య కొనసాగుతున్న నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్షేత్రస్థాయిలో మంగ‌ళ‌వారం పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న తీరును, కల్వర్టుల నిర్మాణం, రహదారి విస్తరణ తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. రహదారి నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతం చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. ఇప్పటికే కల్వర్టుల నిర్మాణ పనులను పూర్తి చేసి, ఒకవైపు రహదారి నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో ఆ మార్గాన్ని వీలైనంత త్వరగా వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. తద్వారా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తగ్గించడంతో పాటు, రెండో వైపు రహదారి నిర్మాణ పనులను మరింత ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. ప్రతిరోజూ పనులకు నిర్దిష్ట లక్ష్యాలను ( డైలీ టార్గెట్స్ ) నిర్దేశించుకొని ఆ లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. పనుల పురోగతిని రోజువారీగా సమీక్షిస్తూ, అవసరమైన యంత్రాలు, సిబ్బంది, నిర్మాణ సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.

     ప్రజలకు, వాహనదారులకు ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, నిర్మాణ పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నాలుగు లైన్ల రహదారి అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం తగ్గి, ప్రజలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కలుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. 

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page