Tuesday, November 17, 2026
No menu items!
HomeCrime Newsఇంట్లోకి రాకెట్.. మంటలు చెలరేగి వస్తువుల ధ్వంసం

ఇంట్లోకి రాకెట్.. మంటలు చెలరేగి వస్తువుల ధ్వంసం

📰 Generate e-Paper Clip

కాచిగూడ, న‌వంబ‌ర్ 11, ( అద్దం న్యూస్ ) :     

ఇంట్లో మంటలు చెలరేగి వస్తువులు ధ్వంస‌మైన ఘ‌ట‌న‌ కాచిగూడ పోలీస్‌స్టేష‌న్ పరిధిలో జరిగింది. సీఐ రాజశేఖ‌ర్‌ తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి.. అంబ‌ర్‌పేట నియోజ‌క‌వ‌ర్గం తిలక్‌న‌గ‌ర్ ప్రాంతానికి చెందిన ర‌వీందర్ కుమారుడు బి.భరత్ కుమార్ ( 39 ) వృతిత్యా టైలర్. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు ఇంట్లో కింది ఫ్లోర్‌లో దీపావళి నోములు చేస్తుండగా ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లోని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రాకెట్ ను కాల‌వ‌డంతో ప్రమాద‌వ‌శాత్తు నేరుగా కిటికిలోంచి రాకెట్ వ‌చ్చి బెడ్ రూమ్‌లో ప‌డింది. బెడ్ రూమ్‌లోని బీరువా, ప‌ట్టు చీర‌లు, చీర‌ల మ‌ధ్య దాచిపెట్టుకున్న 3 ల‌క్ష‌ల 40 వేల రూపాయ‌ల న‌గ‌దు, ప‌రుపులు, కూల‌ర్‌, ఫ్యాన్లు, ఇత‌ర కిచెన్ సామాన్లకు మంట‌లంటుకున్నాయి. ఈ మంట‌ల‌కు కిచెన్ సామాన్లు కాలిబూడిదయ్యాయి. కుటుంబ‌స‌భ్యులు కాచిగూడ పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో ఘ‌ట‌నా స్థ‌లికి పోలీసులు వ‌చ్చి స్థానికుల స‌హ‌కారంతో మంట‌ల‌ను ఆర్పివేశారు. కాచిగూడ ఏఎస్ఐ విఎన్‌.రావు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page