‘అఖండ 2’ యూఎస్ మార్కెట్‌లో అరుదైన రికార్డు!
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Tandavam)కు విడుదలతోనే భారీ స్పందన లభిస్తోంది. మాస్ ఆడియన్స్‌లో ఉన్న బాలయ్య క్రేజ్ ఈ సినిమాతో మరోసారి రుజువైంది. ఈ చిత్రంతో బాలకృష్ణ నార్త్ అమెరికాలో అరుదైన రికార్డు సాధించారు. వరుసగా ఐదు సినిమాలు 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేయగా, ‘గౌతమి పుత్ర శాతకర్ణి’తో కలిపి మొత్తం ఆరు సినిమాలు మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరాయి.
గ్రాండ్ విజువల్స్, పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బాలయ్యకు ఇచ్చిన ఎలివేషన్ ఒక్క టీజర్‌తోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా రిలీజ్ తర్వాత మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అంతేకాదు బాలయ్య కెరీర్‌లో వరుసగా ఐదోసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
ఈ సినిమాతో బాలకృష్ణ అమెరికాలో అరుదైన ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్నారు. నార్త్ అమెరికా మార్కెట్‌లో బాలయ్య నటించిన వరుసగా ఐదు సినిమాలు 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటడం విశేషం. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాగు మహారాజ్’, తాజాగా ‘అఖండ 2’… ఈ ఐదు సినిమాలు వరుసగా మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరాయి. టాలీవుడ్‌లోని సీనియర్ హీరో సినిమాలు వరుసగా ఐదు సార్లు ఈ ఫీట్ సాధించడం చాలా అరుదైన విషయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply