‘నారీ నారీ నడుమ మురారి’ రిలీజ్‌ డేట్ ఫిక్స్..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ అనౌన్స్ చేశారు. టైటిల్ తగ్గట్టుగానే ఇద్దరు హీరోయిన్లతో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. పొంగల్ బాక్సాఫీస్ వద్ద పలు క్రేజీ చిత్రాలతో పోటీ పడనుంది. గతంలో సంక్రాంతికి రెండు హిట్లు అందుకున్న శర్వానంద్, ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొడతాడని నిర్మాతలు ధీమాగా ఉన్నారు.

సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ కి తగ్గట్టుగానే శర్వాకి జోడీగా ఇద్దరు హీరోయిన్లు సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించడంతో, గత కొన్ని రోజులుగా ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ టైమ్ ను అనౌన్స్ చేశారు. మార్నింగ్ షోలతో కాకుండా సాయంత్రం 5.49 గంటలకు థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page