హైదరాబాద్, అద్దం న్యూస్ : హోలి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు వైన్ షాప్స్ మూసివేయడంతో బ్లాక్‌లో మద్యాన్ని విక్రయిస్తున్న ముగ్గురిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ తెలిపిన ప్రకారం హోలి పండుగ సందర్భంగా వైన్స్ షాపులు బంద్ ఉండడంతో బ్లాక్‌లో మద్యాన్ని అమ్మి లాభాలు పొందాలని అంబర్‌పేట్‌కు చెందిన జావిద్ ఖాన్ (40), అచ్చయ్యనగర్‌కు చెందిన సయ్యద్ సాజిద్ (40)లు, కుమ్మరి శివకుమార్ (30)లు నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని బాగ్‌లింగంపల్లిలో విక్రయించారు. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు ఆ ముగ్గురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులో తీసుకున్నారు. జావిద్ ఖాన్, సయ్యద్ సాజిద్ ల నుంచి 24 క్వార్టర్ బాటిల్స్ (విస్కీ), శివకుమార్ వద్ద నుంచి 53 క్వార్టర్ బాటిల్స్ (విస్కీ)లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply