‘అఖండ 2’ న్యూ రిలీజ్ డేట్ ఇదే
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న ‘అఖండ 2: తాండవం’ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ పాన్ ఇండియా సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే గత ఐదు రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కి తెర దించుతూ మేకర్స్ న్యూ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నందమూరి అభిమానులు కోరుకున్న తేదీకే బాలయ్య సినిమాని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ 2: తాండవం’. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ పాన్ ఇండియా చిత్రం ఊహించని విధంగా వాయిదా పడింది. గత ఐదు రోజులుగా నెలకొన్న సస్పెన్స్ కి తెర దించుతూ మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు అఫిషియల్ గా వెల్లడించారు. నిజానికి అఖండ-2 చిత్రం డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఆర్థిక పరమైన వివాదాలు, మద్రాసు హైకోర్టు స్టే కారణంగా వాయిదా పడింది. డిసెంబర్ 11న ఈ మూవీప్రీమియర్ షోలు పడబోతున్నాయి.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply