కమ్యూనిటీహాల్ పెండింగ్ నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ పావని
హైదరాబాద్, జూన్ 13, ( అద్దం న్యూస్ ) : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని సంజీవయ్యనగర్ బస్తీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిధులతో గతంలో ప్రారంభించిన కమ్యూనిటీహాల్ పెండింగ్ నిర్మాణ పనులను డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని శనివారం పరిశీలించారు. దాదాపు పనులు పూర్తి అయ్యాయని, కరెంటు పనులు కొనసాగుతున్నాయని, కాంట్రాక్టర్ తెలిపాడు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ పావని మాట్లాడుతూ… 6 సంవత్సరాల క్రితం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తన ఎంపి నిధుల నుంచి రూ.14 లక్షలను కేటాయించి, ప్రారంభించిన పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ పెండింగ్‌లో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు కమ్యూనిటీహాల్‌ను అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్, ఆనంద్‌రావు, సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, రాజు, నీరజ్, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, బస్తీ నాయకులు రమేష్ కుమార్, నర్సింగ్ రావు, రాజయ్య, హర్షిత్, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply