Friday, September 18, 2026
HomecinemaRajasekhar: షూటింగ్‌లో హీరో రాజశేఖర్‌కి తీవ్ర గాయాలు

Rajasekhar: షూటింగ్‌లో హీరో రాజశేఖర్‌కి తీవ్ర గాయాలు

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Hero Rajasekhar) కొత్త సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. నవంబర్ 25న మేడ్చల్ సమీపంలో జరుగుతున్న చిత్రీకరణలో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ఆయన కుడికాలికి తీవ్ర గాయం అయ్యింది. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన సర్జరీలో కాలిలో ప్లేట్లు, వైర్లు అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని యూనిట్ వర్గాలు తెలిపాయి. మూడు నుంచి నాలుగు వారాలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆయన జనవరి 2026లో షూటింగ్‌ల్లో తిరిగి పాల్గొనే అవకాశం ఉంది.

ఈ కారణంగా రాజశేఖర్ (Hero Rajasekhar) ప్రస్తుతం చేస్తున్న సినిమాల షూటింగ్‌లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఆయన ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిన తర్వాతే తిరిగి సెట్లలో అడుగుపెట్టనున్నారు. రాజశేఖర్ అప్‌కమింగ్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘బైకర్’ సినిమాలో ఆయన ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. బైక్ రేసింగ్ నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో రాజశేఖర్ పాత్ర కథకు చాలా ముఖ్యమైన మలుపు తీసుకువస్తుందని సమాచారం. దీనితో పాటు, ఆయన మరో రెండు సినిమాలకు కూడా ఇప్పటికే కమిట్ అయ్యారు. అయితే ఆ చిత్రాల టైటిల్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతానికి ఈ అన్ని ప్రాజెక్టుల షూటింగ్‌లు రికవరీ తర్వాతే తిరిగి ప్రారంభం కానున్నాయి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page